బీన్స్‌ @ రూ.145 | - | Sakshi
Sakshi News home page

బీన్స్‌ @ రూ.145

May 12 2026 6:24 AM | Updated on May 12 2026 6:24 AM

బీన్స్‌ @ రూ.145

సనత్‌నగర్‌: బీన్స్‌ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్‌లోనే కిలో బీన్స్‌ రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో 180–200 వరకు పలుకుతోంది. వెజ్‌ బిర్యానీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించే బీన్స్‌ ధర అమాంతం పెరగడంతో అటు హోటళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు బీన్స్‌ ధరను భారీగా పెంచేశారు. వారం క్రితం రైతుబజార్‌లో రూ.60–70లుగా ఉన్న బీన్స్‌ ధర ఒక్కసారిగా రూ.115కు పెరిగింది. సోమవారం నాటికి రూ.145కు చేరింది. పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో బీన్స్‌ ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement