నాంపల్లి: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బడిలో పిల్లలు బరువుపనుల్లో నలిగిపోతున్నారు. ఆయాలు, సబార్డినేట్లు చేయాల్సిన పనులను విద్యార్థులకు అప్పగిస్తున్నారు రెడ్‌హిల్స్‌లోని సైఫాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో. ఉపాధ్యాయులే వీరి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వాహనాల్లో వచ్చే ఆహార పదార్థాలను పిల్లలే పాఠశాల లోపలికి మోసుకొస్తున్నారు. అన్నం, గుడ్లు, పప్పు వంటి వాటిని లోనికి తెచ్చుకుని, ఎవరికివారే వడ్డించుకుంటున్నారు.నల్లా దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారి వివరణ..
నాంపల్లి మండల డిప్యూటీ ఈవో వీరలక్ష్మిని వివరణ కోరగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని, త్వరలోనే పాఠశాలను సందర్శించి విచారణ చేపడతానని చెప్పారు. విద్యార్థులతో పాఠశాలలో పనిచేయించడం తప్పేనని, విచారణలో ఆ విషయం తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.


