శభాష్‌ రాముడు | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ రాముడు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

అంబర్‌పేట: అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడు అబ్దుల్‌ మన్నన్‌ను పట్టించిన ఆర్మీ మాజీ జవాన్‌ రాముడిని కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ గురువారం సన్మానించారు. అంబర్‌పేట ఇరానీ హోటల్‌ బస్టాప్‌ వద్ద మంగళవారం రాముడు బస్సు దిగుతున్నారు. ఆ సమయంలో ఆయన మెడలోని బంగారు గొలుసు లాక్కుపోవడానికి మన్నన్‌ ప్రయత్నించగా రాముడు ప్రతిఘటించారు. తన వయస్సును కూడా లెక్కచేయకుండా అతడిని ఒడిసిపట్టుకున్నారు. డయల్‌–100 ద్వారా సమాచారం అందుకున్న అంబర్‌పేట పెట్రోలింగ్‌ సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని మన్నన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మల్లేపల్లికి చెందిన ఇతడిపై 31 పాత కేసులు ఉన్నాయి. అబ్దుల్‌ మన్నన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇతడి అనుచరులు కోటేష్‌, మల్లేష్‌ కోసం గాలిస్తున్నారు. రాముడితోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఎస్సై సురేష్‌, కానిస్టేబుళ్లు దినేష్‌రెడ్డి, భరత్‌ కుమార్‌లను కొత్వాల్‌ గురువారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌కు పిలిపించి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీ సెల్‌ డీసీపీ సీహెచ్‌ రూపేష్‌ పాల్గొన్నారు.

కరుడుగట్టిన నేరస్తుడినిపట్టించిన రిటైర్డ్‌ ఆర్మీ జవాను

అభినందించిన సీపీ సజ్జనర్‌

Advertisement
 
Advertisement
Advertisement