చందానగర్: ఏరో స్పేస్ రంగం గత పదేళ్ళ కాలంలో ఎంతో పురోగతి సాధించిందని డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్, ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజబాబు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో రెండు రోజులపాటు నిర్వహించే 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సు సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ..ఏరో స్పేస్ రంగంలో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అందులో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఉత్పత్తి, సర్టిఫికేషన్ అనేవన్నారు. ఈ నెల 17,18 తేదీలలో ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సును ఎస్కీ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, నీతిఆయోగ్‌కు చెందిన డాక్టర్ వికె సారస్వత్, సీఎస్‌ఐఆర్ ప్రతినిధి డాక్టర్ ఎన్ కళైసెల్వి, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌డాక్టర్ జి సతీష్‌రెడ్డి, డాక్టర్ ఎస్ సోమనాథ్ వంటి నిష్ణాతులు పాల్గొంటారని ఆయన వివరించారు.
– డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్, ఏఈఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజాబాబు


