ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో మానసికంగా కుంగుబాటుకు లోనై ఇంట్లో ఉరేసుకొని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ హరీష్ కథనం ప్రకారం..భోలక్‌పూర్ కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుర్వి విశాల్ గౌడ్ (28) ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూమ్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకుని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రెండేళ్ల క్రితం మల్లాపూర్‌కు చెందిన నవ్యతో విశాల్‌కు వివాహమైయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే దంపతుల మధ్య విభేదాలు రావడంతో కావ్య పుట్టింట్లోనే ఉంటుంది. ఇటీవల కావ్య భర్త విశాల్‌గౌడ్‌పై ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో మానసికంగా కుంగిపొయాడని, కావ్య, ఆమె కుటుంబీకుల వేధింపుల కారణంగానే విశాల్‌గౌడ్ ఉరేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


