గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీ
కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను రాచ కొండ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం క్షేత్రస్థాయి లో పర్యవేక్షించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బందోబస్తు ఎలా చేపట్టాలి అనే అంశాలపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, డీసీపీ ఎస్బీజీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు ఉన్నారు.


