తెలుగు యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
నిజాంపేట్: అనుమానస్పద స్థితిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌కు చెందిన ప్రాంతానికి చెందిన కె. పరుశురాం ( 22 ) బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం హాస్టల్ గదిలో పరుశురాం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


