
పోలీసు అమరవీరుల స్థూపం పనుల పరిశీలన
గన్‌ఫౌండ్రీ: గోషామహల్ పోలీస్ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను గురువారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. డీజీపీ వెంట అదనపు డీజీ పీ మహేష్ భగవత్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్, నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తదితరులు ఉన్నారు.
పనులు పరిశీలిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి