
గల్లీ గల్లీ మోత మోగాల్సిందే..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో ఇక గల్లీ గల్లీ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేక రథాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ప్రచార రథాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార రథ చక్రాలు కదం తొక్కనున్నాయి. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, పాలనను కీర్తిస్తూనే, మరోవైపు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రత్యేకంగా రూపొందించిన పాటలతో ఈ రథాలు ప్రజల్లోకి వెళ్లనున్నాయి. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కార్యకర్తలు ప్రచార రథాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించేలా వ్యూహం రూపొందిస్తున్నారు. అలాగే సీనియర్ నేతలు కూడా ప్రచార రథాలపైనే కదన రంగంలోకి దూకుతారని తెలుస్తోంది.
తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ప్రచార రథాలు..