
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
వెంగళరావునగర్: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి అధికారి ఆర్.వి.కర్ణన్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మారుతీనగర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఇంజనీరింగ్స్ కాలనీలోని దక్ష స్కూల్స్‌లో ఏర్పాటు చేసిన 18 పోలింగ్ స్టేషన్లను ఆయన నిశితంగా పర్యవేక్షించారు. అనంతరం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కమిషనర్ వెంట జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రజినీకాంత్‌రెడ్డి తదితర సిబ్బంది ఉన్నారు.