
జలమండలి ఖాతాలో మరో పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డులు అందుకున్న జలమండలి.. మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్‌టీఐ కేసుల్లో ఉత్తమ సేవలకు తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.