
మధురం..56 ఏళ్ల జ్ఞాపకం
గురువును సత్కరించిన పూర్వ విద్యార్థులు
అంబర్‌పేట: విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఆత్మీయంగా సత్కరించారు. 56 ఏళ్లు గడిచినా విద్య నేర్పిన గురువును వారు విస్మరించలేదు. 1969లో కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో పాఠాలు చెప్పిన మాస్టారు కె.యాదవరెడ్డి (ప్రముఖ కవి నిఖిలేశ్వర్)ని శిష్యులు సత్కరించి ఆత్మీయతను పంచారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు శివంరోడ్ లోని ఓ హోటల్ వేదికై ంది. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో 1969 బ్యాచ్ విద్యార్థులు ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, డాక్టర్ భగవత్ రెడ్డి, సత్యనారాయణ, డి.ఎస్.ఎన్ మూర్తి, మల్లాది రాఘవ, జగన్‌రావుతో పాటు మరో 25 మంది పాల్గొన్నారు.