
శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ..
కంటోన్మెంట్: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లి కంసాలి బజార్లో బి. ప్రవీణ్ కమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసంఉంటున్నాడు. బంధువుల ఇంట్లో బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 6న కుటుంబంతో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉన్నాయి. 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేలు విలువ చేసే పంచలోహ విగ్రహం, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.