
కోడ్ కూసింది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో క్షేత్ర స్థాయిలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్ నియోజక వర్గంలోని ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను బల్దియా సిబ్బంది తొలగిస్తున్నారు. బుధవారం రాజకీయ నేపథ్యమున్న విగ్రహాలను దుస్తులతో మూసివేశారు. ఆయా కూడళ్లలోని పార్టీ జెండాలను సైతం తొలగించారు. ఇప్పటికే బస్టాప్‌లలో ఉన్న ఫ్లెక్సీలను, బస్తీల్లో ఉన్న రాజకీయ నేతల ఫ్లెక్సీలను కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. మరో వైపు గోడలపై రాసిన రాతలను చెరిపేసేందుకు రంగులను తీసుకొచ్చి సిబ్బంది శ్రమిస్తున్నారు– ఫిలింనగర్
జూబ్లీహిల్స్‌లో..

కోడ్ కూసింది!

కోడ్ కూసింది!