
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు
గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోవడంతో సీవీఆర్ న్యూస్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు జర్నలిస్టు కాలనీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్ నెం. 45 జంక్షన్‌లోని బారికేడ్లను తొలగించి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళే వాహనాలను ముందుకు పంపించారు. బస్సును టోయింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కదలకపోవడంతో మెకానిక్‌ను తీసుకొచ్చి బస్సుకు రిపేర్ చేయించి తరలించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ నర్సింగ్‌రావు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పంపించే వరకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.