
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ–వీల్‌చైర్
శంషాబాద్: శారీరక ఇబ్బందులతో నడవలేని ప్రయాణికుల కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–(ఎలక్ట్రానిక్) వీల్‌చైర్‌ను మంగళవారం నుంచి ఎయిర్‌పోర్టు నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రెస్టో ఎయిర్‌సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ–వీల్‌చైర్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిపార్చుర్ ఫోర్‌కోర్ట్ నుంచి ఎస్‌హెచ్‌ఏ వద్ద నున్న డీఎఫ్‌ఎండీ పాయింట్ వరకు వీటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తనిఖీల అనంతరం అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులకు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.