మద్యం దుకాణాలకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలకు టెండర్లు

Sep 26 2025 11:14 AM | Updated on Sep 26 2025 11:14 AM

మద్యం దుకాణాలకు టెండర్లు

మద్యం దుకాణాలకు టెండర్లు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మద్యం దుకాణాలకు ఔత్సాహిక వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గురువారం నోటిఫికేషన్‌ వెలువడింది. రెండేళ్ల కాలానికి డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఈసారి కూడా షాపుల కేటాయింపులో ఎస్సీ (10శాతం), ఎస్టీ (5శాతం), గౌడ (15 శాతం) కులస్తులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు. అక్టోబర్‌ 23న షాపుల వారీగా లక్కీ డ్రా తీస్తారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. సరూర్‌నగర్‌ ఎకై ్సజ్‌ పరిధిలో 138 మద్యం షాపులు ఉండగా, వీటిలో 25 గౌడ కులస్తులకు, 11 ఎస్సీలకు, ఎస్టీలకు 2 ఖరారు చేశారు. మిగిలిన షాపులను జనరల్‌ కేటగిరీలో ప్రకటించారు. శంషాబాద్‌ ఎకై ్సజ్‌ పరిధిలో 111 మద్యం షాపులు ఉండగా.. 9 గౌడ్స్‌కు, 6 ఎస్సీలకు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement