
శ్రద్ధతో శుద్ధి!
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ఓఆర్‌ఆర్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ, క్లినింగ్ కోసం జలమండలి డయల్–ఎ–సెప్టిక్ ట్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల క్లీనింగ్, డంపింగ్ కోసం సుమారు 50 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. నివాస, వాణిజ్య సముదాయాల్లోని సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేసి వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను.. చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోస్తే ఇటు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపేది. దీనిని నివారించడానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులో తీసుకొని వచ్చింది. జీహెచ్‌ఎంసీ అవతల, ఓఆర్‌ఆర్ లోపలి 7 కార్పొరేషన్‌లు, 18 మున్సిపాలిటీలతో పాటు 18 గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేయనుంది. సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమర్చి పనితీరు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది.
వ్యర్థాల క్లీనింగ్‌పై శిక్షణ
సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల క్లీనింగ్ నిర్వహణపై వాహనాల ఆపరేటర్లకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శాసీ్త్రయ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. సెప్టిక్ ట్యాంక్‌ను క్లీనింగ్ చేసి వ్యర్థాలను ప్రతిపాదిత ఎస్టీపీలు, ఎఫ్‌ఎస్టీపీల్లో ఎస్టీపీల్లో డంపింగ్ చేసి, శుద్ధి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం కోసం 155313/14420కు కాల్ చేయవచ్చు.
శుద్ధి కేంద్రాలు ఇలా..
జలమండలి పరిధిలో అంబర్‌పేట్, నల్లచెరువు, నానక్ రామ్‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీల వద్ద 40 కేఎల్‌డీ సామర్థ్యం గల కో–ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించింది. ఇప్పటి వరకు 84 మిలియన్ లీటర్ల సెఫ్టేజ్ కో– ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేశారు.
డయల్– ఎ– సెప్టిక్ ట్యాంక్
తాజాగా ఓఆర్‌ఆర్ పరిధిలో సైతం..
అందుబాటులో 50 వాహనాలు
టోల్‌ఫ్రీ నంబర్– 155313/14420