
ఎనీ ఎమర్జెన్సీ.. డయల్–112
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా.. ‘డయల్–112’ సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఫోన్ కాల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (టీజీఈఆర్‌ఎస్‌ఎస్) సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఈ నెలలో ఇప్పటి వరకు ఆరు ఉదంతాల్లో తక్షణం స్పందించిన యంత్రాంగాలు పెను ప్రమాదాలను తప్పించాయి. ఆ వివరాలను తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు.
ఎస్సార్ నగర్‌లో అగ్ని ప్రమాదం:
ఎస్సానగర్‌లోని కేఫ్ కాఫీ డేలో ఈ నెల 3న మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై ‘112’కు మధ్యాహ్నం 3.37కు కాల్ వచ్చింది. టీజీఈఆర్‌ఎస్‌ఎస్ సిబ్బంది వెంటనే ఇటు ఎస్సార్‌నగర్ పోలీసులతో పాటు అటు అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న బలగాలు ఆరుగురిని రెస్క్యూ చేసి.. గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటున్న మంటలు రెండో అంతస్తు వరకు విస్తరించినా తక్షణ స్పందనతో 20 నిమిషాల్లోనే నియంత్రించగలిగారు.
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వేధింపులు:
ఈ నెల 5న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు మహిళా ప్రయాణికుల్ని వారి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. దీనిపై బాధితులు టీ–సేఫ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది కూడా టీజీఈఆర్‌ఎస్‌ఎస్‌కు చేరడంతో అక్కడి సిబ్బంది రైల్వే అధికారులు, శంకర్‌మ్మెట్, కామారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. రైలు కామారెడ్డి రైల్వేస్టేషన్ చేరుకునే లోపు అక్కడకు వెళ్లిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నాయి.
బహదూర్‌పురలో ఆత్మహత్యాయత్నం:
ఈ నెల 7న నగరంలోని బహదూర్‌పురా ఫ్లైఓవర్ వద్ద ఓ యువతి ఆత్మహత్యకు యత్నిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. వీళ్లు ‘112’కు కాల్ చేసి విషయం చెప్పారు. టీజీఈఆర్‌ఎస్‌ఎస్ సిబ్బంది ఈ సమాచారాన్ని బహదూర్‌పుర పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఆమె ప్రాణాలు కాపాడారు.
రైల్లో ప్రయాణిస్తున్న చిన్నారి రెస్క్యూ:
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో తొమ్మిదేళ్ల బాలుడు ఒంటరిగా ప్రయాణిస్తుండటాన్ని తోటి ప్రయాణికులు వరంగల్ దగ్గర గుర్తించారు. ఈ విషయాన్ని వాళ్లు ‘112’కు తెలిపారు. వీరి ద్వారా సమాచారం అందుకుని అప్రమత్తమైన వరంగల్ జీఆర్పీ పోలీసులు ఆ రైలు వద్దకు చేరుకుని బాలుడి తల్లిదండ్రుల వివరాలు ఆరా తీశారు. అతడు చెప్పిన అంశాలను బట్టి ఇన్‌స్ట్రాగామ్‌లో సెర్చ్ చేసి బాలుడి తండ్రిని గుర్తించారు. ఆయన్ను సంప్రదించడం ద్వారా సదరు బా లుడు ఛత్తీస్‌గఢ్ నుంచి తప్పిపోయి వచ్చినట్లు తేలింది. బాలుడిని స్టేట్ హోమ్‌కు తీసుకువెళ్లిన పోలీసులు తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
కొండాపూర్, దేశాయిపేటల్లోనూ:
ఈ నెల 11, 15 తేదీల్లో కొండాపూర్, వరంగల్ దేశాయిపేటల్లో ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరి వివరాలు స్థానికుల ద్వారా ‘112’కు అందాయి. ఇక్కడి సిబ్బంది తక్షణం అప్రమత్తమై స్థానిక పోలీసులకు ఘటనాస్థలికి పంపారు. వీళ్లు రెస్క్యూ చేయడంతో ఆ రెండు ప్రాణాలు నిలిచాయి.
గాయపడి వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ..
ఈ నెలలో ఆరు ఉదంతాల్లో తక్షణ స్పందన
వివరాలు వెల్లడించినడైరెక్టర్ కమలాసన్‌రెడ్డి

ఎనీ ఎమర్జెన్సీ.. డయల్–112

ఎనీ ఎమర్జెన్సీ.. డయల్–112