
ట్రాన్స్‌ఫార్మర్ పేలి ద్విచక్రవాహనం దగ్ధం
కేపీహెచ్‌బీ: కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని మూడో రోడ్డులో రెండు ట్రాన్స్‌ఫార్మర్‌ల నడుమ చెలరేగిన మంటలతో ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి మంటలకు ఆహుతి అయ్యింది. స్థానికులు వెంటనే కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్,పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులే మంటలను ఆర్పివేశారు. కేపీహెచ్‌బీ కాలనీ మూడో రోడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్టళ్లు ఎక్కువగా ఉండటంతో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఓవర్ లోడ్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు..