
విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
● వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి
● ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయాలి
● వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: విధుల్లో నిర్లక్ష్య వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం వసతి గృహాల్లో మౌలిక సదుపాయలు, గురుకుల పాఠశాలల సమస్య లు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వనమహోత్సవంపై సంబంధిత అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో తప్పనిసరి పర్యటించాలని అన్నా రు. స్థానిక వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతులు అందుతున్నాయో లేదో తెలుసుకొని ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పురోగతిని బట్టి చెల్లించాల్సిన మొత్తాన్ని లబ్ధిదారుల కు వెంటనే అందజేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా శాఖల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వంద శాతం మొక్కలు నాటాలని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో ఈత మొక్కలు పెంచేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్‌ఓ సంగీత, పీడీ హౌసింగ్ హనుమంతు నాయక్, డీపీఓ సురేష్‌మోహన్, ఉద్యాన శాఖ అధికారి సురేష్, వ్యవసాయ శాఖ అధికారి ఉష, డీఈఓ సుశీందర్‌రావు, బీసీ సంక్షేమ శాఖ కేశూరాం, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రామారావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.