
గోల్కొండ మురిపెం
మూడో బోనం..
గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం మూడో బోనం పూజ ఘనంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే బారులుతీరారు. మరోవైపు నగీనాబాగ్‌లోని నాగదేవత వద్ద మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో తరలి రావడంతో నగీనా బ్యారెక్స్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి యువకులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ.. భక్తిగీతాలను ఆలపిస్తూ ఆకట్టుకున్నారు. దారి పొడవునా శివసత్తుల విన్యాసాలు భక్తులను పారవశ్యానికి గురి చేశాయి. గోల్కొండ కోట మెయిన్ గేటు ఎదురుగా శివసత్తుల పూనకాలు చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోల్కొండ కోట మెయిన్ గేటు నుంచి నగీనాబేగ్ మెట్ల మార్గం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. టోలిచౌకీ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అదే విధంగా టోలిచౌకీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఫతేదర్వాజా, బంజారి దర్వాజా, మకై ్క దర్వాజా తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా పర్యవేక్షించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిణి సి.వసంత పర్యవేక్షణలో బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. – గోల్కొండ