
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలన, విజయాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, యోగా దివస్ అజెండాలతో బీజేపీ గోల్కొండ జిల్లా నేతలతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... మోదీ దేశ పౌరుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చితే దేశంలో ఐఐటీలు, ఐఐఎం, ఎయిమ్స్ సంఖ్య రెట్టింపయ్యాయని, మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. 52 కోట్ల మందికి ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. మేకిన్ ఇండియా సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమామహేంద్ర మాట్లాడుతూ... నాయకులు, కార్యర్తలు కేంద్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. 21న యోగా దివస్ నిర్వహించుకుందామని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేఖ, ప్రేమ్ సింగ్ రాథోడ్, అట్లూరి రామకృష్ణ, ఉమా రాణి, కోలా దీపక్, తదితరులు పాల్గొన్నారు.