
ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?
నగరంలో ప్రస్తుతం ప్రతి రోజు 4.8 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో మాత్రం 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు తగ్గింది. చార్జీల పెంపు ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపైన కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. కొత్త చార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. బెంగళూరులో 45 శాతం పెంచడం వల్ల కొంత వ్యతిరేకత వచ్చిందని, హైదరాబాద్‌లో అలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చార్జీలను పెంచలేదనే అంశాన్ని ప్రధానంగా పేర్కొంటున్నారు.