పోలింగ్ కేంద్రాలు మరో
● 1,500 ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల గుర్తింపు
● గతంలో 3,369.. ప్రస్తుతం 3,453 సెంటర్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో భారీగా నమోదయ్యారు. సాధారణంగా ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో 1,300 నుంచి 1,500 ఓట్లను కేటాయించారు. ఎన్నికల కమిషన్ అక్టోబర్ 4న ఓటర్ల తుది ముసాయిదాను విడుదల చేసింది. ఆ తర్వాత కూడా ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించింది. నవంబర్ 11న మళ్లీ ఓటర్ల తుది జాబితా వెల్లడించింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే కొత్తగా 1,67,163 మంది ఓటర్లు వచ్చి చేరారు. ఈవీఎం మిషన్ల సామర్థ్యానికి మించి (1,500) ఓటర్లున్న పోలింగ్ బూత్‌ల పరిధిలో అదనపు బూత్‌లను ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నంలో 24, ఎల్బీ నగర్‌లో మూడు, మహేశ్వరంలో 31, రాజేంద్రనగర్‌లో ఏడు, శేరిలింగంపల్లిలో 16, షాద్‌నగర్‌లో మూడు చొప్పున అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్టోబర్ నాలుగు నాటికి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 3,369 పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటి పరిధిలో 33,56,056 మంది ఓటర్లు ఉండగా, నవంబర్ 11 నాటికి ఓటర్ల సంఖ్య 35,22,420కి చేరింది. పోలింగ్ బూత్‌ల సంఖ్యను కూడా 3,369 నుంచి 3,453కి పెంచాల్సి వచ్చింది. అదనంగా 84 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
అక్టోబర్‌లో.. నవంబర్‌లో
● ఇబ్రహీంపట్నంలో గతంలో 3,10,756 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 16,901 మంది ఓటు హక్కు పొందారు. ప్రస్తుతం వీరి సంఖ్య 3,27,657కు చేరింది.
● ఎల్బీనగర్‌లో గతంలో 5,65,576 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 26,698 మంది ఓటు హక్కు పొందగా, ప్రస్తుతం వీరి సంఖ్య 5,93,774కు చేరింది.
● మహేశ్వరంలో గతంలో 5,17,376 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 29,337 మంది ఓటు హక్కు పొందగా, వీరి సంఖ్య 5,46,713కు చేరింది.
● రాజేంద్రనగర్‌లో గతంలో 5,52,535 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 29,579 మంది ఓటు హక్కు పొందారు. ప్రస్తుతం వీరి సంఖ్య 5,82,114కు చేరింది.
● శేరిలింగంపల్లిలో గతంలో 6,98154 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 3,44,33 మంది ఓటు హక్కు పొందగా ప్రస్తుతం వీరి సంఖ్య 7,32,587కు చేరుకుంది.
● చేవెళ్లలో గతంలో 2,54,050 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 8,034 మంది ఓటు హక్కు పొందగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,62,094కు చేరింది.
● కల్వకుర్తిలో గతంలో 2,30,785 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 11,113 మంది ఓటు హక్కు పొందగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,41,898కి చేరింది.
● షాద్‌నగర్‌లో గతంలో 2,25,524 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 1,08,68 మంది ఓటు హక్కు పొందగా, ప్రస్తుతం వీరి
సంఖ్య 2,36,392కి చేరింది.
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు..
నియోజకవర్గం అక్టోబర్ వరకు ప్రస్తుతం
ఇబ్రహీంపట్నం 319 345
ఎల్బీనగర్ 570 573
మహేశ్వరం 511 542
రాజేంద్రనగర్ 535 542
శేరిలింగంపల్లి 622 638
చేవెళ్ల 298 298
కల్వకుర్తి 262 262
షాద్‌నగర్ 252 255