A Mother Committed Suicide Because Her Son Had Failed in the CA Exam - Sakshi
Sakshi News home page

కుమారుడు పరీక్షలో తప్పాడని.. తల్లి ఆత్మహత్య

Aug 10 2023 8:00 AM | Updated on Aug 21 2023 9:25 PM

- - Sakshi

హైదరాబాద్: కుమారుడు పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడని మనస్తాపం చెందిన ఓ గృహిణి ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎం.పవన్‌ వివరాల ప్రకారం..గాజులరామారం బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఉండే పు ష్పజ్యోతి (41), నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒక కుమారుడు సీఏ అర్హత పరీక్ష రాశాడు.

కానీ పరీక్షలో తప్పడంతో మనోవేదనకు గురైన పుష్పజ్యోతి బుధవారం ఉదయం బెడ్‌రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందింది. పుష్ప జ్యోతి ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అను మానం వచ్చిన కుటుంబీకులు లోపలికి వెళ్లి చూడగా ఉరి వేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. మృతురాలి భర్త నాగభూషణం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement