హన్మకొండ అర్బన్: ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈకార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ప్రసారం చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ సమయాన్ని మార్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెనన్స్‌కు మండల అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
ప్రజావాణి ఉదయం గంటన్నర మాత్రమే
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


