● ఎమ్మెల్యే కొండా సురేఖ
కాశిబుగ్గ: వరంగల్ ప్రజలపై అమ్మవారి కరుణతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. ఆదివారం నర్సంపేట రోడ్డులోని కనకదుర్గమాత ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..కనకదుర్గాదేవి కరుణ రాష్ట్రానికి ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్‌రాజ్, క్యాతం రవీందర్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భవానీ స్వాములు పాల్గొన్నారు.


