కాజీపేట అర్బన్: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం నియామక పత్రాలను తస్లీమాకు అందించారు. నియామకానికి సహకరించిన టీజీఓ అధికారులు, ఉద్యోగులకు తస్లీమా కృతజ్ఞతలు తెలిపారు.
కేయూ క్యాంపస్: కేయూలోని విద్యాకళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతి డాక్టర్ నల్లాని శ్రీనివాస్‌ను మరో సంవత్సరంపాటు పదవీకాలం పొడిగిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగించినందుకు ఆయన కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంకు కృతజ్ఞతలు తెలిపారు.
గీసుకొండ: తెలంగాణ రాజీవ్ ఆరో గ్య శ్రీ వరంగల్ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా మోటి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా నల్లబెల్లి అనిల్ ఎన్నికయ్యారు.


