మొరం దోపిడీపై ఆర్డీఓ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

మొరం దోపిడీపై ఆర్డీఓ తనిఖీ

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

మొరం దోపిడీపై ఆర్డీఓ తనిఖీ

ఐనవోలు: కొండపర్తిలో మొరం తవ్వకాలు, తరలింపుపై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్పందనగా అధికారులు క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించారు. హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్‌ మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది మెట్రిక్‌ టన్నుల మొరం భారీ ఎత్తున తరలిపోయిందని గుర్తించారు. తరలిన మొరానికి ఫైన్‌ విధించాలని తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం మైనింగ్‌ శాఖ ఆర్‌ఐ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయికి రావడం స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ.. ఇప్పటి వరకు అసలు ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీలు క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టడానికి కాకుండా కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న టైంపాస్‌ వ్యవహారమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల తీరుతో అనుమానాలు!

‘వందలాది టిప్పర్ల మొరం తరలిపోతుంటే స్థానిక యంత్రాంగం ఇన్నాళ్లు ఎందుకు నిఘా పెట్టలేదు? వేల క్యూబిక్‌ మీటర్ల విలువైన సహజ సంపదను కొల్లగొడితే కేవలం నామమాత్రపు ఫైన్‌ వేసి కేసును ముగించే ప్రయత్నం వెనుక ఆంతర్యం ఏంటి? తవ్వకాలకు ఉపయోగించిన భారీ యంత్రాలు జేసీబీ, ఇటాచీ, టిప్పర్లు ఎవరివి? వాటిని ఎందుకు సీజ్‌ చేయలేదు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ శాఖ క్రిమినల్‌ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? క్షేత్రస్థ్ధాయిలో అక్రమంగా మట్టి తరలిందన్న విషయం గుర్తించిన అధికారులు అక్రమార్కులకు ఇబ్బంది కలుగకుండా ఫైన్‌ పేరుతో ఈ దందాను అధికారికంగా సర్దుబాటు చేస్తున్నారా’ అని స్థానికుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్‌ నేరుగా మానిటర్‌ చేస్తూ సమగ్ర సర్వే ద్వారా తవ్వకాల పరిమాణాన్ని తేల్చి అసలు సూత్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement