వినతులు సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వినతులు సత్వరమే పరిష్కరించండి

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

వినతులు సత్వరమే పరిష్కరించండి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఆమె అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 254 వినతులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ ప్రజావాణికి 248 దరఖాస్తులు:

స్వీకరించిన కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. మొత్తం 248 మంది తమ సమస్యలను పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదకు దరఖాస్తులు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ 90, జీడబ్ల్యూఎంసీ 61, హౌసింగ్‌ 13, డీఆర్డీఓ 24, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్‌.కిషోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్‌ఓ విజయలక్ష్మి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ విశ్వప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

వినతులు కొన్ని ఇలా..

● ఖిలా వరంగల్‌ మండలం మామునూరు గ్రామ సరిహద్దులోని 0.34 గుంటల వ్యవసాయ భూమికి అక్రమ మ్యుటేషన్‌పై విచారణ జరిపి న్యాయం చేయాలని తిమ్మాపూర్‌కు చెందిన గంగిడి వీరారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.

● ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి ప్రభుత్వం తమ ఇంటిని కిరాయికి తీసుకుందని, గత డిసెంబర్‌లో ఖాళీ చేసి ప్రభుత్వ భవనంలోకి మార్చారని, ఖాళీ చేసి తొమ్మిది నెలలైనా ఇంతవరకు కిరాయి ఇవ్వలేదని, అద్దె డబ్బులు ఇప్పించాలని గడ్డం సమ్మయ్య విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement