అసోసియేట్‌ ప్రొఫెసర్లకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

అసోసియేట్‌ ప్రొఫెసర్లకు షోకాజ్‌ నోటీసులు

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

అసోసియేట్‌ ప్రొఫెసర్లకు షోకాజ్‌ నోటీసులు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రిజిస్ట్రార్‌ రామచంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ ఎనిమిది మంది యూజీసీ 15 జీఓ ప్రకారం.. కేరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం (క్యాస్‌) ప్రొఫెసర్‌గా పదోన్నతికి అనర్హులుగా ఉన్నారు. ఈ జీఓ ప్రకారం.. ముఖ్యంగా ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా.. ఒక్కో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ తమ గైడ్‌షిప్‌లో ఒక పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ అవార్డు అయి ఉండాలనే నిబంధన ఉంది. ఈఎనిమింది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఈనిబంధనతో వీరు ప్రొఫెసర్‌గా పదోన్నతికి అనర్హులుగా ఉన్నారు. అయితే గతంలో ఉన్న యూజీసీ 14 జీఓ ప్రకారం అయితే ప్రొఫెసర్‌గా పదోన్నతికి అర్హత ఉంటుందని భావించి వారంతా కలిసి న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ ) చైర్మన్‌కు గత కొంతకాలం క్రితంనేరుగా ఓలేఖను పంపినట్లు సమాచారం. తమకు క్యాస్‌ కింద ప్రొఫెసర్‌గా పదోన్నతికి అడ్డంకిగా ఉన్న నిబంధనను సడలించాలని, తమకు ప్రొఫెసర్‌గా గతంలోని 14 జీఓ ప్రకారం అవకాశం కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం వారు యూజీసీ చైర్మన్‌కు పంపిన లేఖకు సంబంధించిన ఒక కాపీని కూడా వర్సిటీ అధికారులకు అందించారు. కాగా, అసోసియేట్‌ ప్రొఫెసర్లు నేరుగా యూజీసీ చైర్మన్‌కు లేఖ ఎలా పంపుతారని, సర్వీస్‌ రూల్స్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు ఇది విరుద్ధం అని వీసీ ప్రతాప్‌రెడ్డి ఈవిషయంలో సీరియస్‌గా పరిగణిస్తున్నారు. వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ రామచంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. త్రూ ప్రాపర్‌ చానెల్‌ వర్సిటీ ద్వారా యూజీసీ చైర్మన్‌కు లేఖ పంపాలని ఇష్టారీతిన లేఖ పంపినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ షోకాజ్‌ నోటీస్‌లో పేర్కన్నారు.

నోటీసులు అందుకున్నది వీరే..

కేయూ కో–ఎడ్యూకేషనల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుమలత, వర్సిటీ క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అర్చన, కేయూ పరిధి కొత్తగూడెం (మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల) ప్రస్తుత డాక్టర్‌ మన్‌మోహన్‌సింగ్‌ ఎర్త్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ పున్నంచందర్‌, డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ రాము, డాక్టర్‌ పద్మజ, స్రవంతి షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్‌

యూజీసీ చైర్మన్‌కు నేరుగా లేఖ

పంపడంపై వీసీ సీరియస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement