వివరణలోనూ.. వీడని ప్రశ్నలు | - | Sakshi
Sakshi News home page

వివరణలోనూ.. వీడని ప్రశ్నలు

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

ఐనవోలు : కొండపర్తి గ్రామం సర్వేనంబర్‌ 1279/2లో గ్రావెల్‌ తవ్వకం తరలింపులో సాక్షి ప్రచురించిన వరుస కథనాలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఇచ్చిన వివరణలో పలు కీలక అంశాలపై స్పష్టత కరువైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాఖ సమర్పించిన దరఖాస్తు, రెవెన్యూ నివేదిక, క్షేత్రస్థాయి పరిశీలన, డీమార్కేషన్‌, పరిమాణం అంచనా, ఆన్‌లైన్‌ పర్మిట్‌ వివరాలను పరిశీలిస్తే విస్తీర్ణం, పరిమాణం, భూమి స్వభావం, అనుమతి ఆధారం వంటి అంశాలపై మరింత వివరణ అవసరంగా కనిపిస్తోంది. మైనింగ్‌ పర్మిట్‌ జారీ చేసే అఽధికారం ఆ శాఖకు ఉన్నప్పటికీ, సదరు భూమి ఏ కేటగిరికి చెందినది, దానికి వర్తించే రెవెన్యూ నిబంధనలు ఏమిటీ, ఎన్‌ఓసీ ఏ ప్రాతిపదికన జారీ చేశారనే విషయాల్లో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

దరఖాస్తు 0.152 హెక్టార్లు..

డీ మార్కేషన్‌ 0.105 హెక్టార్లే!

సర్వేనంబర్‌ 1279/2లో గ్రావెల్‌ కోసం ఓ వ్యక్తి సమర్పించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులో విస్తీర్ణం 0.152 హెక్టార్లు కాగా, గ్రావెల్‌ పరిమాణాన్ని 2000 మెట్రిక్‌ టన్నులుగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కేవలం 0.105 హెక్టార్ల ప్రాంతాన్ని మాత్రమే డీమార్క్‌ చేసినట్లు నివేదికలో వెల్లడించింది. అంటే 0.047 హెక్టార్లు కుదించినట్లు నివేదిక స్పష్టం చేస్తుండగా.. ఆ భూమి ఏ దిక్కున ఉంది? దాని సరిహద్దులు ఏంటి? క్షేత్రస్థాయి కొలతలు ప్రశ్నార్థకంగా మారాయి. అదేవిధంగా 0.5 మీటర్ల సగటు ఎత్తు ఎలా నిర్దారించారో..? 525 క్యూబిక్‌ మీటర్లు 788 మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ ఉన్నట్లు నివేదికలో తెలిపినప్పటికీ అందుకు సంబంధించి లెవల్‌ సర్వే ఏమైనా నిర్వహించారా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. మైనింగ్‌ శాఖ 0.105 హెక్టార్లకు డీమార్కేషన్‌ చేశామని స్పష్టంగా చెబుతుండగా చివరకు జారీ చేసిన ఆన్‌లైన్‌ పర్మిట్‌లో పూర్తి విస్తీర్ణం 0.152 ఎందుకు సూచిస్తుంది, ఆ నిర్ధిష్ట సరిహద్దులను పర్మిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదన్న ప్రశ్నకు సమాధానం కరువైంది.

రెవెన్యూ నివేదికలో భూమి స్వభావం..

మైనింగ్‌ అనుమతికి ఆధారం ఏమిటి?

సర్వేనంబర్‌ 1279/2 సంబంధించి తహసీల్దార్‌ జారీ చేసిన ఎన్‌ఓసీ నివేదికలో అది ప్రభుత్వ అసెన్డ్‌ భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. రెవెన్యూ నివేదిక ఆధారంగానే తాము అనుమతి ఇచ్చామని మైనింగ్‌ శాఖ చెబుతోంది. అసైన్డ్‌ ల్యాండ్‌కు ఏ నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీ జారీ చేశారు? అసైన్డ్‌ భూములకు ప్రత్యేకంగా వర్తించే ఏ చట్టపరమైన ప్రొవిజన్‌ ఆధారంగా మైనింగ్‌ అనుమతి మంజూరు చేశారన్నది ఆ శాఖలు నిరూపించాల్సి ఉంది.

రూ.20స్టాంప్‌ పేపర్‌ ఒప్పందం ఎంతవరకు చెల్లుబాటు?

భూమి ఎత్తుపల్లాలుగా ఉన్నందున చదును చేసుకునేందుకు పట్టాదారుడు రూ.20 స్టాంప్‌ పేపర్‌పై అంగీకారం ఇచ్చినట్లు శాఖ వివరణలో పేర్కొంది. వ్యక్తిగత అంగీకార పత్రం ఉండడం ఒక అంశమైతే, అది రెవెన్యూ రికార్డులోని భూమి వర్గీకరణను మారుస్తుందా? మైనింగ్‌ హక్కును థర్డ్‌పార్టీకి బదలాయించే అధికారాన్ని కల్పిస్తుందా? అనే ప్రశ్నలకు అఽధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. వ్యవసాయం చేయడానికి అనువుగా లేదని దరఖాస్తు దారుడు దరఖాస్తులో పేర్కొనగా సంబంధిత వ్యవసాయ శాఖ అలాంటి నివేదిక ఏమైనా ఇచ్చిందా?

రెండు టీపీ నంబర్లు

మైనింగ్‌ శాఖ వెల్లడించిన వివరాల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు రశీదులో టీపీ14110046 అని ఉండగా, పర్మి ట్‌ వివరాల పేజీలో టీపీ14110026 అని నమోదై ఉంది. ఈ రెండింటిలోనూ ఒకే వ్యక్తి పేరు ఉన్నప్పటికీ రెండు నంబర్లకు ఉన్న సాంకేతిక సంబంధాన్ని మైనింగ్‌ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ప్రభుత్వ పనికి అనుమతి.. గ్రావెల్‌ ఎక్కడికి వెళ్లింది?

వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పనుల కోసం గ్రావెల్‌ వినియోగిస్తున్నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అలాంటప్పుడు అనుమతించిన 788 ఎంటీలో వాస్తవంగా ఎంత పరిమాణం తవ్వారు? ఎన్ని ట్రాన్సిట్‌ పాస్‌లు జారీ అయ్యాయి? ప్రభుత్వ పనులకే చేరిందా లేక ఇతర ప్రాంతాలకు తరలించారా? అనే వాస్తవాలు వెలుగు చూడాలంటే ట్రాన్సిట్‌ పాస్‌లు, వాహనాల వివరాలు, డెస్టినేషన్‌ రికార్డులు సంబంధిత వర్క్‌ ఆర్డర్‌, రిసీవింగ్‌ అథారిటీ రికార్డులను కూడా పారదర్శకంగా బయటపెట్టాలి. గత సోమవారం పెద్ద ఎత్తున సుమారు 20 టిప్పర్ల ద్వారా మొరం గ్రామం నుంచి తరలివెళ్తుంటే స్థానిక సర్పంచ్‌ వాహనాలను ఆపి ట్రాన్సిట్‌ పాస్‌లు అడిగితే చూపించలేదు. దీనిపై పోలీస్‌శాఖ, రెవెన్యూశాఖ ఏమైనా కేసులు నమోదు చేశారా? తెలియాల్సి ఉంది.

0.152 హెక్టార్ల దరఖాస్తు..

0.105 హెక్టార్లకే డీమార్కేషన్‌

భూమి స్వభావం, అనుమతి విస్తీర్ణం,

ఒకే ఫైలుకు రెండు టీపీ ఐడీలు

ప్రభుత్వ ప్రాజెక్టు పేరు చెప్పి అక్రమ రవాణా జరిగిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement