ఆరుతడి పంటలతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలతో రైతులకు మేలు

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

● ఏడీఏ ఆదిరెడ్డి

ఎల్కతుర్తి : ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని, ఆరుతడి పంటలతోనే రైతులకు మేలు జరుగుతుందని ఏడీఏ ఆదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతునేస్తం కార్యక్రమం నిర్వహించారు. యాసంగిలో సాగు చేసే విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సాగుకు సరిపడా నీరు లేకపోవడం వల్ల రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. సింగిల్‌విండో చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డితో కలిసి రైతులకు పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేశారు. బావుపేట సర్పంచ్‌ బత్తిని రవీందర్‌, ఏఓ రాజ్‌కుమార్‌, ఏఈఓ పున్నంచందర్‌, తదితర రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement