ధర్మసాగర్ : సిబ్బందితో కలిసి భోజనం చేస్తున్న సర్పంచ్ రేణుక
MýSÐ]l$Ìêç³NÆŠḥ: Ð]l¬Æý‡$-VýS$-M>ÌSÓ Ô¶æ${¿ýæ… ^ólçÜ$¢¯]l² HG…ïÜ O^ðlÆŠ‡ ç³Æý‡Þ¯ŒS Æý‡n*±ÞÆý‡-Ò…-§ýlÆŠ‡,
● ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరవీందర్
కమలాపూర్ : పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఊరి శుభ్రత మన అందరి బాధ్యత అని ఏఎంసీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్ అన్నారు. కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే ఊరి కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ 14వ వార్డులో సర్పంచ్ పబ్బు సతీశ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శ్రమదానం చేసి మురుగు కాల్వలు శుభ్రం చేసి రోడ్లు ఊడ్చి వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామం అపరిశుభ్రంగా ఉంటే దోమల వ్యాప్తి పెరిగి రోగాల బారిన పడాల్సి వస్తుందని, స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా శ్రమదానంతో ఇళ్ల పరిసరాలను, గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా మార్చుకుంటే గ్రామం బాగుపడటంతో పాటు అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమదానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ మాట్ల రమేశ్, వార్డు సభ్యులు, నాయకులు ఐలయ్య, శ్రీనివాస్, తిరుపతి, మల్లారెడ్డి, రాజయ్య, భిక్షపతి, రాజవీరు, ఐలయ్య, దేవయ్య, అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం సభ్యులు, గరుడ గణపతి భజన మండలి సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ : స్థానిక కస్తూర్బాలో శనివారం గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ గుంటిపల్లి రేణుక, ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామిగౌడ్, పంచాయతీ కార్యదర్శి సురేశ్, తదితరులు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములయ్యారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు.


