ఎవరో రావాలి.. పనులు చేయాలని చూడకుండా మండలంలోని ఆటో డ్రైవర్లు సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. మండలంలోని మాందారిపేట నుంచి శాయంపేట వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు కొమ్ముల సంతోష్, ఎండి రఫీక్, నిమ్మల రాజ్ కుమార్ సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక కొనుగోలు చేసి గుంతలను పూడ్చారు. ఆటో డ్రైవర్లను తోటి వాహనదారులు, ప్రయాణికులు అభినందించారు.
– శాయంపేట


