హసన్‌పర్తి: మండలంలోని గుండ్లసింగారంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూమిలో వేసిన గుడిసెలను శనివారం తెల్లవారుజామున రెవెన్యూ, పోలీస్, మున్సిపల్‌శాఖ అధికారులు కూల్చివేశారు. ఐదేళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది గుడిసెలు వేసుకుని సురవరం సుధాకర్‌రెడ్డి పేరిట కాలనీ ఏర్పాటు చేశారు. గుడిసెలు కూల్చివేస్తున్నారనే సమాచారంతో సీపీఐ నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. వారిని ముందస్తుగా అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుడిసెలను కూల్చివేస్తుండగా అడ్డువచ్చిన వారిని పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారు. కాగా, తాము ఇక్కడే ఉంటున్నట్లు ఆధార్, రేషన్‌కార్డులు కూడా పొందినట్లు పలువురు గుడిసెవాసులు చెప్పారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని కోరారు. కాగా, రెండు రోజుల క్రితం ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని కూడా నేలమట్టం చేశారు.
గుడిసెలు కూల్చివేయడం దుర్మార్గం..
గుండ్లసింగారంలో గుడిసెలు కూల్చివేసిన ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించారు. ఈసందర్భంగా బాఽధితులతో మాట్లాడారు. తమ ను ఇళ్లనుంచి బలంతంగా బయటికి గెంటేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీ సుకోవడం లేదని పేర్కొన్నారు. అదే నీడ కోసం 50 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ ప్ర జా వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. భూ సమస్యపై హైదరాబాద్‌లో అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు భిక్షపతి, బాబామియా, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు భిక్షపతి, అశోక్ స్టాలిన్, లక్ష్మణ్, రాజేందర్, రాము, గోపాల్ పాల్గొన్నారు.
300 గుడిసెలు నేలమట్టం..
ముందుస్తు సీపీఐ నాయకుల ఆరెస్ట్


