ఎంహెచ్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా యాదానాయక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంహెచ్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా యాదానాయక్‌

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

ఎంహెచ్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా యాదానాయక్‌

రామన్నపేట: తెలంగాణ మె డికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శిగా వరంగల్‌ జిల్లాకు చెందిన యాదానాయక్‌, ఉపాధ్యక్షులుగా సుధాకర్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మంగళవారం యూనియన్‌ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

గూడూరు : బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం పాటిమీదితండాలో చోటు చేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధారా వత్‌ వీరన్న (34) సోమవారం అర్ధరాత్రి బైక్‌ వస్తూ గ్రామంలోని మలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్సై గిరిధర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement