ముందుకు సాగని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌! | - | Sakshi
Sakshi News home page

ముందుకు సాగని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌!

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

ముందుకు సాగని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌!

ఉమ్మడి వరంగల్‌లో సగటు కవరేజ్‌ 30 శాతం మాత్రమే

సాక్షి, వరంగల్‌ : బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నెల 5వ తేదీ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో మొత్తం 31,304 మంది బాలికలను హెడ్‌కౌంట్‌ సర్వేలో గుర్తించారు. వీరిలో 9,376 మందికి మాత్రమే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించారు. దీంతో సగటు కవరేజ్‌ 30 శాతం వద్దే నిలిచింది.

అందుకే ఆలస్యం..

● చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయి.

● వ్యాక్సిన్‌ బాలికలకు ఇవ్వాల్సి ఉండడంతో తల్లిదండ్రుల సమ్మతి అవసరం అవుతోంది. అనుమతి పత్రాలు ఆలస్యంగా రావడం వల్ల సెషన్లు పూర్తి స్థాయిలో సాగడం లేదు.

● ములుగు, భూపాలపల్లి జిల్లాలోని అటవీ, గిరిజన మండలాల్లో విద్యార్థులను ఒకేచోట సమీకరించడం కష్టంగా మారుతోంది. రవాణా సమస్యలూ ప్రభావం చూపుతున్నాయి.

● పాఠశాలల కార్యకలాపాలు, సెలవులు, విద్యార్థుల గైర్హాజరుతో టీకా సెషన్లు వాయిదా పడుతున్నాయి. ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలతో పాటు హెచ్‌పీవీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి రావడంతో ఫీల్డ్‌ స్థాయిలో వేగం తగ్గుతోంది.

● హనుమకొండ వంటి పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న కుటుంబాల్లో కూడా ‘ఇప్పుడే అవసరం లేదు‘ అనే భావన కనిపించడం కవరేజ్‌పై ప్రభావం చూపుతోంది.

ఇలా చేస్తేనే వేగం పెరుగుతుంది..

● గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

● మహిళా వైద్యులు, గైనకాలజిస్టులు, ఆశా కార్యకర్తల ద్వారా తల్లిదండ్రులకు వ్యాక్సిన్‌ భద్రతపై వివరించాలి.

● పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలి. టీకా తీసుకోని బాలికల జాబితా తయారు చేసి ఇంటింటి ప్రచారం చేపట్టాలి.

● గిరిజన, దూర ప్రాంతాల్లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ బృందాలు ఏర్పాటు చేయాలి.

● కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు మండలాల వారీగా రోజువారీ సమీక్షలు నిర్వహిస్తే కవరేజ్‌ పెరిగే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఇలా...

కవరేజ్‌

1,254

752

8,034

2,909

5,517

1,729

3,127

1,121

5,674

1,611

6,687

2,265

భూపాలపల్లి

జనగామ

ములుగు

వరంగల్‌

హనుమకొండ

మహబూబాబాద్‌

హెడ్‌కౌంట్‌ సర్వే వ్యాక్సిన్‌ పొందినవారు

29%

28%

31%

33%

36%

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement