హన్మకొండ: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు ఒప్పుకున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని ఆర్టీసీ హనుమకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ముందుగా డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా బంక సరళ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 56 రోజుల పాటు సమ్మె చేసినా, 32 మంది కార్మికులు చనిపోయినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మె మొదలు పెట్టిన మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తవుటం ఝాన్సీ, తాళ్లపల్లి మేరీ, విజయ, ఇందిర, శ్వేత, సుజాత, సబితా, కళ్యాణి, తోట వెంకటేశ్వర్లు, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి సుధాకర్, నేహాల్ తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ
సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం


