పనైతే కానీ! | - | Sakshi
Sakshi News home page

పనైతే కానీ!

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

పనైతే కానీ! ఇల్లిల్లూ జల్లెడ

హనుకొండ

హంటర్‌ రోడ్డులో ఓ డివిజన్‌లో ఆరు నెలల క్రితం రూ.15 లక్షల డ్రెయినేజీ పనిని కాంట్రాక్టర్‌ ప్రారంభించాడు. స్థానిక కార్పొరేటర్‌ రూ.60 వేలు కమీషన్‌ అడిగాడు. కాంట్రాక్టర్‌ రూ.30 వేలు ఇస్తానన్నాడు. కార్పొరేటర్‌ పనులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. కమీషన్‌ ఎంతిచ్చినా పర్లేదు పని పూర్తి చేయాలని కార్పొరేటర్‌ ఒత్తిడి పెంచాడు. కార్పొరేటర్ల పదవీ కాలం సమీపిస్తుండడంతో కమీషన్‌ ఎంతిచ్చినా ఫర్లేదు పని త్వరగా పూర్తి కావాలంటున్నట్లుగా తెలుస్తోంది.

డివిజన్లలో అనుమతి లేని భవన నిర్మాణాలు, అదనపు కట్టడాలు, కొత్త ఇంటి నంబర్లు, వివాదాస్పద స్థలాలు, చివరికి రోడ్లకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులను కూడా కార్పొరేటర్లు వదలట్లేదనే విమర్శలొస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసిన వారు ప్ర స్తుతం ఎంతకొంతివ్వాలని, వసూళ్లకు ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని, అనుచరులను రంగంలోకి దింపినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement