● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం అకడమిక్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2030 నాటికి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంచంద్రారెడ్డి, జిల్లా మలేరియా అఽధికారి కె.రజిని, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
న్యూశాయంపేట: పనితీరు, లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఐసీడీఎస్ సూపర్‌వైజర్లను హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలో వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న బాలరక్షాభవన్, స్వధార్ గృహాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలను నిర్వహరణ తీరును అడిగి తెలుసుకున్నారు. పనితీరులో వెనుకబడిన కొంతమంది సూపర్‌వైజర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి తక్షణ వివరణ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సంబంధిత సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట దూపకుంట రోడ్డులోని మైనారిటీ గురుకులంలో ఈనెల 18 నుంచి 13 రోజుల పాటు నిర్వహిస్తున్న వేసవి క్రీడలు ప్రత్యేక క్యాంపును శనివారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి వాలీబాల్, చెస్ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్డర్ సంధ్యారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్‌ఎల్సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాల్ నీలిమాదేవి తదితరులు పాల్గొన్నారు.


