మలేరియా రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మలేరియా రహిత సమాజమే లక్ష్యం

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

మలేరియా రహిత సమాజమే లక్ష్యం

హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య

హన్మకొండ చౌరస్తా: మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలను భాగస్వాములు చేస్తూ మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని అప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. పెద్దమ్మగడ్డలోని వీధులన్నీ తిరుగుతూ మలేరియా నిర్మూలన ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు, మాజీ కార్పొరేటర్‌ డిన్నా, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరి

నయీంనగర్‌: గర్భాశయ కాన్సర్‌ నిరోధకత కోసం 14 ఏళ్లు నిండిన అమ్మాయిలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పకుండా ఇప్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. శనివారం హనుమకొండ పోచమ్మకుంటలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డాక్టర్‌.అప్పయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అంగన్వాడీ, ఇతర కేంద్రాల్లో నిర్వహిస్తున్న 3 సెషన్స్‌లో ఎంత మందికి ఏయే టీకాలు ఇవ్వాల్సి ఉంది? వారిలో ఎంతమందికి ఇచ్చారు రాకపోవడానికి కారణాలేంటి అని పరిశీలించారు. 402 మందికి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా 73 మందికి ఇచ్చినట్లు, సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని, నెలలోపు మిగతా వారికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ డాక్టర్‌ దీప్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement