● చాన్స్‌లర్ ఎ. వరదారెడ్డి
హసన్‌పర్తి : ప్లేస్‌మెంట్‌లో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉందని ఆ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్–2026 సక్సెస్ మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, కృషి, సరైన మార్గదర్శకం విద్యార్థులు సాధించిన విజయాలకు ఫలితమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు నిరంతరం వృద్ధి చేసుకుంటూ కొత్త సాంకేతికతను ఆచరణలో పెట్టి పరిశ్రమ అవసరాలకనుగుణంగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈఏడాది 1,300 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. కొన్ని కంపెనీల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈసంఖ్య మరింత పెరుగుతోందని వివరించారు. అదనంగా 1,500మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ అవకాశాలు సాధించారని తెలిపారు. కళాశాల వైస్ చాన్స్‌లర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రొఫెషనల్ విలువలను పెంపొందించుకోవాలన్నారు. గ్లోబల్ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీన్ డాక్టర్ అర్చనారెడ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


