అన్నదాత కష్టం అగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత కష్టం అగ్గిపాలు

Apr 26 2026 2:03 AM | Updated on Apr 26 2026 2:03 AM

బయ్యారం: పంటచేనుల మధ్య ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి చెలరేగిన మంటలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను బుగ్గిపాలు చేశాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్లెదుటే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యా రు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా బ య్యారం మండలం కొత్తగూడెం సమీపంలోని ధరావత్‌ హరిలాల్‌ మొక్కజొన్న చేనులో శ నివారం వ్యాపించిన మంటలు నిమిషాల్లోనే సమీ పంలోని చేనులకు వ్యాపించాయి. ఈ మంటలు సు మారు వంద ఎకరాల్లోని పంటభూములకు వ్యాపించగా ఇందులో 30 ఎకరాల్లో విరిచి కుప్పలుగా పోసిన కంకులు కాలిపోయాయి. అదేవిధంగా మంటలు వ్యాపించిన భూముల్లో ఉన్న 40 బోర్లతో పాటు పై పులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

కొత్తగూడెం గ్రామాన్ని చుట్టుముట్టిన మంటలు..

మొక్కజొన్న సొప్పతోపాటు కంకులకు అంటుకున్న మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్థానికులతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌ మహబూబాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గ్రామానికి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో కొత్తగూడెం, లింగగిరి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి గ్రామ శివారులో..

మొగుళ్లపల్లి: షార్ట్‌ సర్క్యూట్‌తో 30 ఎకరాల మొక్క జొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన శనివారం మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెలువడిన మంటలతో పక్కనే ఉన్న మొక్క జొన్న పంటకు నిప్పు అంటుకుంది. దీంతో దాదాపు 30 ఎకరాల్లో పంట అగ్నికి ఆహుతైంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఆర్‌ఐ శివరామకృష్ణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి

చెలరేగిన మంటలు

పలుచోట్ల అగ్నికి ఆహుతైన

మొక్కజొన్న పంట

కొత్తగూడెంలో 30 ఎకరాలు,

40 బోర్లు, పైపులు దగ్ధం

పెద్దకోమటిపల్లి–గణేశ్‌పల్లి శివారులో 30 ఎకరాలు

లక్షలాది రూపాయల నష్టం

కన్నీరుమున్నీరవుతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement