‘అక్షర కురుక్షేత్రాన్ని’ సమాజంలోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

‘అక్షర కురుక్షేత్రాన్ని’ సమాజంలోకి తీసుకెళ్లాలి

Apr 26 2026 2:03 AM | Updated on Apr 26 2026 2:03 AM

కాశిబుగ్గ: అక్షర కురుక్షేత్రాలాంటి గ్రంథాలను సమాజంలోకి తీసుకెళ్లాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు అన్నారు. శనివా రం భండారు రమాదేవి, చంద్రమౌళీశ్వర్‌రావు మె మోరియల్‌ ట్రస్ట్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ భండారు ఉమామహేశ్వర్‌రావు రచించిన సమగ్ర వచ న ఆంధ్ర మహాభారతంలోని ఆది, సభా, విరాట, ఉద్యోగ పర్వచతుష్టయ గ్రంథావిష్కరణ మహోత్సవం వరంగల్‌లోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ రాజేశ్వర్‌రా వు మాట్లాడుతూ డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు చి ల్డ్రన్స్‌ స్పెషలిస్టుగా విధులు నిర్వర్తిస్తూ, మరోవైపు సమాజంలో మార్పు కోసం గ్రంథాలు రచించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం మహాభారతంలోని నాలుగు గ్రంథాలను ఆవిష్కరించి ముందుకు తీసుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. వనం లక్ష్మీకాంతారావు సంయోజకత్వంలో సాగిన సభలో డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు ప్రతిష్టాత్మకంగా రచించిన ఆంధ్రభారత వచన కావ్య పర్వాలు, ఆది, సభా, విరాట ఉద్యోగ పర్వాలను ప్రముఖ పండితలు డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా డాక్టర్‌ దహగాం సాంబమూర్తి ఆదిపర్వాన్ని, డాక్టర్‌ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి సభా ప ర్వాన్ని, గిరిజా మనోహనాబాబు విరాటపర్వం, డాక్టర్‌ ఎన్‌వీఎన్‌ చారి ఉద్యోగ పర్వాన్ని సమీక్షించారు. కవులు ఎస్‌వీఎన్‌ శర్మ, డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఆర్‌కె ప్రసాద్‌, పొట్లపల్లి శ్రీనివాస్‌, వాసిరెడ్డి కృష్ణారావు, వీఆర్‌ విద్యార్థి, సీహెచ్‌ శివరావు, వై.నాగయ్య, మో త్కూరు మనోహరారావు, వాణి ప్రసాద్‌, అవధాని చేపూరి శ్రీరామ్‌, అనిల్‌ ప్రసాద్‌, కంది శంకరయ్య, జేఎన్‌ శర్మ, మండువ రామగోపాల్‌రావు, మండువ రవీందర్‌రావు, వెలుగు ప్రభాకర్‌ పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement