మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని భూ భారతి చట్ట రూపకర్త, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. భూమి చట్టాలు, భూ రికార్డులు, భూ భారతి చట్టంపై మ హబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. ప్రతీ రైతు తప్పనిసరిగా భూ సర్వే చేయించుకోవాలని, పాస్ పుస్తకాలు కలిగి ఉండాలని, ఆ పుస్తకాల్లో తప్పులు ఉంటే వెంటనే సరి దిద్దుకోవాలని సూచించారు. త్వరలో భూమికి భూ ఆధార్, భూయజమానులకు భూఆధార్ కార్డులు రానున్నాయని, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లలో మార్పులు రానున్నాయన్నారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి చట్టం పనులు ప్రారంభించారని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, జూనియర్ సివి ల్ జడ్జి స్వాతి మురారి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్


