ఎంపీ కడియం కావ్యకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఎంపీ కడియం కావ్యకు సన్మానం

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

ఎంపీ కడియం కావ్యకు సన్మానం

హన్మకొండ: వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్యను తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ సన్మానించింది. శుక్రవారం హనుమకొండ కనుకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్లమెంట్‌లో తన గళం విప్పుతూ, జిల్లా అభివృద్ధికి పాల్పడుతున్నందుకు ఎంపీ డాక్టర్‌ కడియం కావ్యను సన్మానించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ.. ఉత్తర దక్షణ భారత కూడలిగా ఉన్న వరంగల్‌ సమగ్రాభివృద్ధి కోసం పార్లమెంట్‌ వేదికను వందశాతం హాజరుతో తన గళం విప్పుతున్నానన్నారు. కార్యక్రమలో తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌, ప్రతినిధులు అస్నాల శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సురేశ్‌కుమార్‌, సంజీవరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్‌, రఘుపతిరెడ్డి, శివాజీ, శ్రీప్రియ, పవిత్ర, వస్కుల శ్రీనివాస్‌, స్వాతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement