నిధుల కేటాయింపులేవి?
– 8లోu
న్యూస్‌రీల్
పసుపు ధర ౖపైపెకి..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది.
నర్సంపేటలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నర్సంపేట :
నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్‌గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్‌ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్‌పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
భారీ బందోబస్తు...
నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు.
ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ
నర్సంపేటలో బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్‌ఐ రణధీర్ ఉన్నారు.
డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో..
డ్రైవర్ శంకర్‌గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
హనుమకొండ డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
బస్సు బయటకు రావడంతో అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు
ఉర్దూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి.
తీవ్రగాయాలతో హైదరాబాద్‌కు తరలింపు.. వెంటిలెటర్‌పై చికిత్స
ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ


