సిమెంట్‌ వ్యాపారంలో తిరుగులేని సంస్థ ‘భారతి’ | - | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ వ్యాపారంలో తిరుగులేని సంస్థ ‘భారతి’

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

మేనేజర్‌ మార్కెటింగ్‌ జె.రాజేశ్వర్‌రెడ్డి

కాజీపేట అర్బన్‌ : సిమెంట్‌ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్‌ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్‌ ఎదుగుతోందని, వికాట్‌ గ్రూప్‌ కంపెనీ ప్రపంచంలో 12 దేశాల్లో విస్తరించి ఉందని వికాట్‌ గ్రూప్‌ భారతి సిమెంట్‌ సంస్థ మేనేజర్‌ మార్కెటింగ్‌ జె.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం కాజీపేట మండలం మడికొండలోని శ్రీ తిరుమల ఏజెన్సీలో బిల్డర్లకు టెక్నికల్‌ మీట్‌ ఏర్పాటు చేయగా వికాట్‌ గ్రూప్‌కు చెందిన భారతి సిమెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ సునీల్‌తో కలిసి మాట్లాడారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్‌ ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్‌ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్‌ కాంక్రీట్‌ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్‌ ఇంజనీర్లు సైట్‌ వద్దకే వచ్చి సహాయపడుతారని తెలిపారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్స్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌ రూ. 20 అధికంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్‌ శివప్రసాద్‌, డీలర్‌ జయధీర్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement